జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని శ్రీనగర్‌లోని ఫెయిర్‌వ్యూ గుప్కర్ రోడ్‌లో ఉన్న ఆమె అధికార నివాసానికి తరలించారు. ప్రజా భద్రత చట్టం కింద ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే అధికార నివాసానికి తరలించినప్పటికీ ఆమె నిర్భందం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. అది సబ్సిడరీ జైలుగా ఉంటుందని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలపై ఫిబ్రవరి 6న పీఎస్‌ఏకింద అదుపులోకి తీసుకున్నారు.