యూపీలో 308 క‌రోనా పాజిటివ్ కేసులు..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఇప్ప‌టివ‌ర‌కు 308 క‌రోనా (కోవిడ్‌-19) పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు ఆ రాష్ట్ర సీఎ యోగి ఆదిత్య‌నాథ్ వెల్ల‌డించారు. సీఎం యోగి ఆదిత్య‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ..మొత్తం 308 క‌రోనా పాజిటివ్ కేసులుండ‌గా...వీరిలో త‌బ్లిఘి జమాత్ (మ‌ర్కజ్ ప్రార్థ‌న‌లు) నుంచి వ‌చ్చిన వారు 106 మంది ఉన్నార‌ని తెలిపారు.


యూపీలో 10 ప‌రీక్షా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. యూపీ కోవిడ్‌-కేర్ ఫండ్ కు వ‌చ్చిన విరాళాలు, ఇత‌ర నిధుల‌ను వైద్యసేవ‌లను మ‌రింత మెరుగ‌ప‌రిచేందుకు, క‌రోనా బాధితుల‌కు మెరుగైన చికిత్స‌నందించేందుకు,  ఆస్ప‌త్రుల్లో అన్ని సౌక‌ర్యాలు ఏర్పాటు చేస్తామ‌ని సీఎం యోగి ఆదిత్యానాథ్ పేర్కొన్నారు.