తిరుమలలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు టీటీడీ ఈవో శ్రీ అనిల్‌కుమార్ ఆదేశాల మేరకు అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి పర్యవేక్షణలో టీటీడీ లోని అన్ని విభాగాలు పటిష్ట చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా టైంస్లాట్ టోకెన్లు ద్వారా శ్రీవారి దర్శనం ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు మంగళవారం తెల్లవారుజామున 12.00 గంటల నుండి టైంస్లాట్ టోకెన్లు జారీ చేసి వైకుంఠం క్యూ కాంప్లెక్స్- 1 మరియు 2లలో వేచి ఉండకుండా నేరుగా శ్రీవారి దర్శనానికి అనుమతించారు. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఒక్కొక్క హాలులో 1000 మంది భోజనం చేసే అవకాశం ఉన్న, 500 మందికి మాత్రమే భోజనం అందిస్తున్నారు. ఇందులో ఒక టేబుల్‌కు నలుగురు కుర్చోవలసి ఉండగా ఇద్దరికి మాత్రమే భోజనం ఏర్పాటు చేశారు. ఉద్యోగులు అందరు మాస్కులు ధరించి, శానిటైజర్లతో చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటున్నారు. అదేవిధంగా తిరుమలలోని వివిద ఫుడ్ కౌంటర్లలలోను మాస్కులు ధరించి అన్నప్రసాదాలు పంపీణి చేస్తున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు