దేశవ్యాప్తంగా 137 కరోనా కేసులు నమోదు

భారత్‌లో కరోనా వైరస్‌ ఉద్ధృతంగా వ్యాపిస్తుండటంతో కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల సంఖ్య  పెరుగుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా కరోనా  పాజిటివ్‌ కేసుల సంఖ్య 137కు చేరింది. భారత్‌లో అత్యధికంగా మహారాష్ట్రలో 39 కేసులు నమోదు కాగా..అందులో ముగ్గురు విదేశీయులు ఉన్నారు. వైరస్‌ కారణంగా ఒకరు మృతి చెందారు.