ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో మైలు రాయికి చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆ యాప్‌ను వాడుతున్న యూజర్ల సంఖ్య ప్రస్తుతం 200 కోట్లకు చేరుకుంది. 2017 జూలైలో వాట్సాప్ యూజర్ల సంఖ్య 100 కోట్లకు చేరుకోగా, మరో 100 కోట్లకు కేవలం రెండున్నరేళ్లు పట్టడం విశేషం. ఇక ఈ మైలురాయికి చేరుకున్న సందర్భంగా వాట్సాప్ ఒక ప్రకటనను విడుదల చేసింది. అందులో.. యూజర్ల సెక్యూరిటీ, ప్రైవసీ పట్ల తాము రాజీ పడే ప్రసక్తే లేదని వాట్సాప్ తెలిపింది.