రైతుల ఆదాయాన్ని 2022 కల్లా రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్‌సభలో మాట్లాడుతూ.. 2020 బడ్జెట్ ప్రజల ఆదాయాన్ని పెంచనున్నట్లు చెప్పారు. దీంతో ప్రజల కొనుగోలు శక్తి కూడా పెరగనున్నట్లు తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్లను మరింత సరళతరం చేయనున్నట్లు చెప్పారు. వ్యవసాయంలో మరింత పోటీతత్వం పెరగాలన్నారు. సమగ్రమైన పంట విధానాలను అవలంబించాలన్నారు. వ్యవసాయంలో కొత్త టెక్నాలజీ కూడా అవసరమన్నారు. మోడల్ చట్టాలను అమలు చేసే రాష్ట్రాలను మరింత ప్రోత్సహించినున్నట్లు మంత్రి తెలిపారు. నీటి ఎద్దడి ఉన్న వంద జిల్లాల్లో ప్రత్యేక ప్రణాళిక అమలు చేయనున్నట్లు తెలిపారు. సోలార్ పంపులను పెట్టుకునేందుకు సుమారు 20 లక్షల రైతులకు పీఎం కుసుమ్ పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా సురక్షా ఈవమ్ ఉత్తన్ మహాభియాన్ పథకాన్ని మరింత విస్తరించనున్నట్లు మంత్రి తెలిపారు.
20 లక్షల రైతులకు సోలార్ పంపులు : నిర్మల