పార్లమెంట్ ను కుదిపేస్తున్న దిశ హత్యా ఘటన


పార్లమెంట్ ను కుదిపేస్తున్న దిశ హత్యా ఘటన



దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార ఘటన పై పార్లమెంట్ లో వాడి వేడి చర్చ జరుగుతుంది. ఉభయ సభల్లో వివిధ పార్టీలకు చెందిన ఎంపీ లు బాధితురాలకి న్యాయం చేయాలని కోరారు. అందులో భాగంగా లోక్ సభలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ లో ఆడవాళ్ళ పై జరుగుతున్న అకృత్యాలను అరికట్టడం లో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని తప్పు బట్టారు. శంషాబాద్ లో జరిగిన దిశ హత్యచార ఘటన చాలా దారుణం. నిందితులకు కఠిన శిక్ష పడాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి త్వరగా తీర్పు వెలువరించాలని కోరుతున్నాం. ఆలాగే ఈ కేసులో దోషులకు ఉరి శిక్ష విదించాలని డిమాండ్ చేస్తున్నాం అని ఉత్తమ్ కుమార్ అన్నారు.


ఇదే అంశం పై రాజ్యసభ లో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ గులాం నబీ ఆజాద్‌ మాట్లాడుతూ .. కేవలం చట్టాలు చేయడం ద్వారా దిశ వంటి ఘటనలు పునరావృతం కాకుండా అరికట్టలేమని అన్నారు. ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై అరాచకాలు తగ్గడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచార ఘటనలపై వెంటనే దర్యాప్తు చేపట్టి దోషులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్‌ చేశారు. ఇక రాజ్యసభ చెర్మైన్ , ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. చట్టాలు చేయడం వల్ల బాధితులకు న్యాయం జరగదు ఆ చట్టాలను మార్చాల్సిన అవసరం కూడా ఉందని పేర్కొన్నారు. దేశం లో మరో సారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని .. ఇలాంటి దాడులకు స్వస్తి పలకాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.


ఇక దిశ హత్యాచార ఘటన లో పోలీసులు ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే వారిని నడిరోడ్డు లో ఉరి తీయాల్సింది పోయి జైల్లో పెట్టి మేపుతున్నారని ప్రజాసంఘాలు , ప్రజాసంఘాలు , విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.